![]() |
![]() |

లేడీ బాడీ బిల్డర్ కీర్తి నాయుడు బిగ్ బాస్ సీజన్ 9 గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కామన్ మ్యాన్ కేటగిరిలో అప్లై చేసుకోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్ కి ఆడిషన్స్ కి పిలిచారు అని చెప్పింది..అలాగే ఇంకొన్ని విషయాలను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. "ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 7 లో వాళ్ళే నన్ను పిలిచారు. నాకు ఒక గ్లిమ్ప్స్ లా ఉంటుంది. ఎపిసోడ్ 1 లో ఒక కుస్తీ టాస్క్ ఉంటుంది. అందులో నేనే కనిపిస్తాను. ఇక ఇప్పుడు కొత్త బిగ్ బాస్ సీజన్ 9 కి ఆడిషన్స్ ఇచ్చాను. ఒక వీడియో పంపాను ..గ్రూప్ డిస్కషన్ కి రమ్మని మెసేజ్ పంపించారు. నేను వెళ్లాను. ఐతే అక్కడ పది పది మందికి కలిపి ఒక గ్రూప్ పెట్టారు. ఐతే వాళ్ళు చెప్పింది వేరు అక్కడ జరిగింది వేరు. "ప్రాస్టిట్యూషన్ ని లీగలైజ్ చేయొచ్చా" అని ఒక టాపిక్ ఇచ్చారు. అసలు ఈ టాపిక్ మాట్లాడుకునేది కాదు. ఆ టాపిక్ అసలు నాకు నచ్చలేదు. టాపిక్ అంటే సబ్జెక్టు కంటెంట్ ఉండాలి. కానీ అదేం లేకుండా లేచి అరవడం మాత్రమే జరిగింది చాలామంది. నాకు అది నచ్చలేదు.
ఇక బిగ్ బాస్ అప్ డేట్స్ చూస్తుంటే వీళ్ళు జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు. అగ్నిపరీక్ష అని, సెలెక్షన్స్ అని అన్నీ టాస్కులు ఇచ్చేసి అంతా ఐపోయాక కూడా ఇంకా సెలెక్ట్ చేస్తున్నారు..అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు కండక్ట్ చేయడం. నేను సెలెక్ట్ కాలేదు అంటూ ఒక మెయిల్ కూడా పంపించారు. అసలు నన్ను ఎందుకు తీసుకోలేదు అన్నదే నా ప్రశ్న. ఇక బిగ్ బాస్ 7 లో ఆ గ్లిమ్ప్స్ లో కనిపించినందుకు ఇప్పుడు నన్ను తీసుకోలేదు అనుకోవాలా ? ఐతే బిగ్ బాస్ 7 లో వాళ్ళు చెప్పిన టైమింగ్ ఒకటి అక్కడ జరిగింది ఇంకోటి. ఉదయం 10 గంటల కల్లా వచ్చేయమన్నారు. జస్ట్ 4 గంటలే ఉంటుంది అని చెప్పడంతో నేను వెళ్లాను. అలా షూటింగ్ అంతా డిలే చేస్తూ ఆ రోజు నైట్ 2 వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నా రోజు మొత్తం వేస్ట్ ఐపోయింది అప్పుడు. కొంతమంది డైరెక్ట్ గా ఫ్రీగా ఎలాంటి టాస్కులు లేకుండా వచ్చేస్తున్నప్పుడు మాకెందుకు ఈ టాస్కులన్నీ ? బిగ్ బాస్ వాళ్ళు జనాలని పిచ్చోళ్లను చేస్తున్నారు" అంటూ కామెంట్ చేసింది కీర్తి.
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.
![]() |
![]() |